ఏపీలో రహదారుల నిర్మాణానికి గడ్కరీ రూ.1000 కోట్ల నిధులు

ఏపీలో రహదారుల నిర్మాణానికి గడ్కరీ రూ.1000 కోట్ల నిధులు

Andhra-Pradesh-investment-summit-sees-665-MoUs-worth-over-Rs

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఏపీకి వరాల వర్షం కురిపించారు.ఏపీలో రహదారుల నిర్మాణానికి  గడ్కరీ రూ.1000 కోట్ల నిధులను ప్రకటించారు. సీఎం చంద్రబాబు అభ్యర్థనపై ఆయన తక్షణమే  ఈ ప్రకటన చేశారు. అలాగే రూ.3500 కోట్లతో 39 రైల్‌ ఓవర్‌ బ్రిడ్జిలను ప్రారంభిస్తామని వివరించారు. 2019లోగా లక్ష కోట్ల రూపాయలతో రాష్ట్రంలో జాతీయ రహదారులన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నందున మార్చి నెలలో మరోసారి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి రూ.2000 కోట్లతో బకింగ్‌హమ్‌ కెనాల్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. జాతీయ స్థాయిలో 40 పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నామని ఇందులో రెండు ఏపీలోనే ఉన్నాయన్నారు. ఇందులో ఒకటి వైజాగ్‌-చెన్నై కారిడార్‌, మరొకటి బెంగళూరు-చెన్నై కారిడార్‌ అని కేంద్రమంత్రి వివరించారు. శ్రీకాకుళం నుంచి అమరావతి, అమరావతి నుంచి అనంతపురం దాకా రహదారులను అభివృద్ధి చేస్తామని, ప్రధానంగా ఓడరేవులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని గడ్కరీ చెప్పారు

665 ఒప్పందాలు
10.50 లక్షల కోట్ల పెట్టుబడులు
22.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
రాజధానిలో 1.29 లక్షల కోట్ల పెట్టుబడి..

రాష్ట్ర రాజధాని అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.20 వేల కోట్లు మంజూరు చేశారని మంత్రి పి.నారాయణ తెలిపారు. సీఆర్‌డీఏకి సంబంధించి మొత్తం 62 ఒప్పందాలు చేసుకున్నామని, విలువ రూ.1,24,523 కోట్లు ఉంటుందని తెలిపారు. అనంతపురం, అమరావతి మధ్య మూడు వేల కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే రూ.75 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిందన్నారు.