నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రూ.1300 కోట్ల పెట్టుబడులతో విద్యా సంస్థల స్థాపన

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రూ.1300 కోట్ల పెట్టుబడులతో విద్యా సంస్థల స్థాపనకు బెంగళూరుకు చెందిన పీఈఎస్‌ యూనివర్సిటీ ముందుకొచ్చింది. ఈ మేరకు శనివారం విశాఖ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు సమక్షంలో పీఈఎస్‌ వ్యవస్థాపడుకు, వర్సిటీ చాన్సెలర్‌ ఎం.ఆర్‌.దొరస్వామి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా దాదాపు 5 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమరావతిలో తొలుత అధ్యాపక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు నేటీ ఆధునిక విద్యా విధానంపై పీఈఎస్‌ సంస్థ శిక్షణ ఇస్తుంది. సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు, శిక్షణలు నిర్వహిస్తారు. పీఈఎస్‌ సంస్థల ఐదు దశాబ్దాల అనుభవం నవ్యాంధ్రకు ఉపయోగపడేందుకు తోడ్పాటునందిస్తున్న ఆ సంస్థ వ్యవస్థాపకుడు దొరస్వామిని సీఎం చంద్రబాబు అభినందించారు.

89 ఒప్పందాలు.. 12 వేల కోట్లు పెట్టుబడులు

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు భారీగా వచ్చాయి. ఆతిథ్యం(హోటళ్లు), ఆహ్లాదం(అమ్యూజ్‌మెంట్‌), సాహస పర్యాటకం(అడ్వెంచర్‌ టూరిజం) సహా ఇతర రంగాల్లో మొత్తం రూ.12 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 89 ఒప్పందాలు జరిగాయి. ఒప్పందాలకు సంబంధించి భాగస్వామ్య సదస్సులో పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ జయరామిరెడ్డి, కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌లు శనివారం తొలుత పెట్టుబడిదారులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం.. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారు. రంగాలవారీగా చూస్తే హోటళ్ల నిర్మాణంలో రూ.2,300 కోట్లు, అమ్యూజ్‌మెంట్స్‌ రంగంలో రూ.5,700 కోట్లు, అడ్వెంచర్స్‌ విభాగంలో రూ.834 కోట్లు, ఇతర రంగాల్లో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. రెండు వేల కోట్లతో అమరావతిలో బుద్ధ స్క్వేర్‌ నెలకొల్పుతున్నారు. ప్రాజెక్టుల ద్వారా 45 వేల మందికి నేరుగా ఉపాధి లభించనున్నదని జయరామిరెడ్డి తెలిపారు.

సీఐఐ భాగస్వామ్య సదస్సులో 75 ఐటీ కంపెనీలతో రూ.6095 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ కుదిరినట్టు ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

*